తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళలను రేప్​ చేస్తానంటూ కాన్సులేట్​కు బెదిరింపులు! - ఇజ్రాయెల్​ కాన్సులేట్

Threat Call to Israel Consulate: దేశంలోని బాలికలు, మహిళలపై అత్యాచారానికి పాల్పడతామని ముంబయిలోని ఇజ్రాయెల్​ కాన్సులేట్​కు బెదిరింపు ఫోన్ కాల్​ వచ్చింది. దుండగుడు వారిని హత్య చేస్తానని కూడా హెచ్చరించినట్లు సమాచారం. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

threat call to Israel consulate
mumbai

By

Published : Feb 24, 2022, 6:32 PM IST

Threat Call to Israel Consulate: మహారాష్ట్ర ముంబయిలోని లోయర్​ పరేల్​లో ఉన్న ఇజ్రాయెల్​ కాన్సులేట్​కు ఫోన్​ కాల్​ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఆ దేశంలోని బాలికలు, మహిళలపై అత్యాచారం చేస్తానంటూ దుర్భాషలాడాడు. వారిని చంపేస్తామని కూడా హెచ్చరించాడు.

సోమవారం సాయంత్రం ఈ బెదిరింపులకు సంబంధించిన కాల్ వచ్చిన తర్వాత.. పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇజ్రాయెల్ కాన్సులేట్. ఈ వ్యవహారం తీవ్రతను పరిగణనలోకి తీసుకొని వారు కేసు నమోదు చేశారు. నిందితుడు మధుర్ మోహిన్​ను అరెస్టు చేశారు.

మధుర్ స్వస్థలం హరియాణా అని పోలీసులు తెలిపారు. అతడు గతంలో అనేక దేశాలకు వెళ్లాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. అతడి మానసిక స్థితి బాగోలేదని పోలీసులు వెల్లడించారు. కేసుపై దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:'భారత్ నుంచి సంపూర్ణ మద్దతు కోరుతున్నాం'

ABOUT THE AUTHOR

...view details