తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Mulugu, Telangana Assembly Election Results 2023 Live : ములుగులో ముచ్చటగా ముడోసారి - సీతక్కకు దాదాపు 28వేల మెజారిటీ - ములుగు ఎన్నికల రిజల్ట్స్ 2023

Mulugu, Telangana Assembly Election Results 2023 Live : ములుగులో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన సీత‌క్క విజ‌యం సాధించారు. బీఆర్ఎస్ అభ్య‌ర్థి నాగ‌జ్యోతిపై కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క సుమారు 28వేల ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. ఈ విజ‌యంతో ములుగు నియోజకవర్గంలో వ‌రుస‌గా సీత‌క్క మూడోసారి విజ‌యం సాధించిన‌ట్ల‌యింది.

Mulugu Telangana Assembly Election Results 2023 Live
Telangana Assembly Election Results 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 1:17 PM IST

Updated : Dec 3, 2023, 5:42 PM IST

Mulugu, Telangana Assembly Election Results 2023 Live :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్​లను లెక్కించారు. అలాగే ఉదయం 8.30 గంటల నుంచి మొదటి రౌండ్ లెక్కింపు మొదలుపెట్టారు. దాదాపుగా అన్ని జిల్లాలలోనూ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది.

Telangana Assembly Election Results 2023 Live :మొదటి రౌండ్​లోనే కాంగ్రెస్ ఈ స్థాయిలో ముందంజ కనిపించడంతో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. మరోవైపు ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఘనవిజయం సాధించారు. సీతక్క, బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై విజయం గెలుపొందారు.

సీతక్కకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీఎం అభ్యర్థుల పేర్లలో సీతక్క పేరు కూడా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. హస్తం పార్టీ కేబినెట్ ఏర్పాటు చేస్తే సీతక్కకు కీలక పదవి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎస్టీ సమాజిక వర్గానికి చెందిన సీతక్క సీఎం రేసులో ఉంటారని ఆమె అనుచరలు భావిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై సీతక్క గెలుపొందారు. ములుగులో మళ్లీ సీతక్క ట్రెండ్ సెట్​ చేశారు.

Telangana Assembly Election Results 2023 Live : పోస్టల్​ బ్యాలెట్లు - తొలి రౌండ్​ విజేతలు వీరే

Seethakka Telangana Election Results 2023 :సీతక్క తెలంగాణలో ఈ పేరు తెలియనివారు ఉండరనే చెప్పాలి. ధనసరి అనసూయ అలియాస్(సీతక్క) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు. ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆమె.. ఈ 2023 ఎన్నికల్లో(Telangana Elections) కూడా ఇదే నియోజకవర్గం నుంచే బరిలోకి దిగారు. అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయ అరంగేట్రానికి ముందు 15 ఏళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు సీతక్క.

2004లో తొలిసారి తెలుగుదేశం నుంచి పోటీ చేసిన సీతక్క, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలుపొంది, తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి సైకిల్ దిగిన సీతక్క కాంగ్రెస్ చేయి అందుకున్నారు.

మంచిర్యాలలో కాంగ్రెస్​ కార్యకర్తపై బీఆర్​ఎస్​ కౌన్సిలర్​ దాడి

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందులాల్‌పై 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌(Congress Ticket)పై పోటీ చేసి 22,671 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పార్టీకి సీతక్క చేస్తున్న సేవలు గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం, 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలిగా పదవి ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తనతో పాటు కచ్చితంగా కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అంతేకాదు తప్పకుండా కీలక శాఖకు మంత్రిగా కూడా వ్యవహరిస్తానని సీతక్క ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Telangana Assembly Election Results Live 2023 : ఇట్స్​ జడ్జిమెంట్ టైమ్ - మరికొన్ని గంటల్లో తెలంగాణ ప్రజల తీర్పు

Last Updated : Dec 3, 2023, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details