Mulayam Wife Sadhna Gupta: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్‌కు సతీవియోగం కలిగింది. ఆయన రెండో భార్య సాధనా గుప్తా.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. కొద్దిరోజులుగా గుప్తా.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతోంది. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ములాయం సింగ్ యాదవ్‌కు సతీవియోగం - mulayam second wife
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌కు సతీవియోగం కలిగింది. ఆయన రెండో భార్య సాధనా గుప్తా శనివారం కన్నుమూశారు.
mulayam singh yadav wife sadhna gupta passes away
గుప్తాకు వేరే వ్యక్తితో 1987లో తొలి వివాహం జరిగింది. నాలుగేళ్లకే విడాకులు పొందిన ఆమెకు ములాయం సింగ్ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. 2003లో ములాయం సింగ్ మొదటి భార్య మాలతీ దేవి చనిపోయిన అనంతరం.. సాధనా గుప్తాతో వివాహాన్ని అధికారికంగా ప్రకటించారు ములాయం.
Last Updated : Jul 9, 2022, 4:14 PM IST