తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ రాయ్‌ను బంగాల్ అసెంబ్లీలో ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌గా స్పీకర్ బిమన్ బెనర్జీ నియమించడం.. గందరగోళానికి దారి తీసింది. ముకుల్ రాయ్ నియామకాన్ని నిరసిస్తూ.. ప్రతిపక్ష నేత సువేందు అధికారి నేతృత్వంలోని భాజపా ఎమ్మెల్యేలు.. సభ నుంచి వాక్ఔట్ చేశారు.
క్రిష్ణానగర్ ఉత్తర్ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు ముకుల్ రాయ్. అనంతరం ఆయన టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ముకుల్ రాయ్‌ను తన పదవికి రాజీనామా చేయాలని భాజపా చాలారోజుల నుంచి డిమాండ్ చేస్తోంది. అయితే.. జూన్‌లో పీఏసీ సభ్యుడిగా ముకుల్ రాయ్ ఎంపికయ్యారు. ఇప్పుడు ఆయనను ఈ కమిటీకి ఛైర్మన్‌గా బంగాల్ అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు.
'టీఎంసీ కాలరాసింది..'
ముకుల్ రాయ్ నియామకంపై భాజపా నేత సువేందు అధికారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పీఏసీ కమిటీకి ప్రతిపక్ష సభ్యులనే ఛైర్మన్‌గా నియమించే సంప్రదాయాన్ని టీఎంసీ కాలరాసి.. ముకుల్ రాయ్‌కు ఆ పదవి కట్టబెట్టిందని ధ్వజమెత్తారు.