తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తదుపరి అటార్నీ జనరల్‌గా ముకుల్‌ రోహత్గి.. మరోసారి అవకాశం! - కేకే వేణుగోపాల్ పదవీ కాలం

Mukul Rohatgi Attorney General: మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి మరోసారి ఏజీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏజీగా ఉన్న కేకే వేణుగోపాల్ రిటైర్మెంట్ తర్వాత ముకుల్ ఈ బాధ్యతలను చేపట్టవచ్చని తెలుస్తోంది.

ముకుల్‌ రోహత్గి
mukul rohatgi

By

Published : Sep 13, 2022, 11:13 AM IST

Mukul Rohatgi Attorney General: సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి మరోసారి అటార్నీ జనరల్‌(ఏజీ)గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్‌ రిటైర్మెంట్‌ తర్వాత రోహత్గి ఈ బాధ్యతలను చేపట్టవచ్చు. గతంలో ఏజీగా పనిచేసిన రోహత్గి 2017లో ఈ బాధ్యతల నుంచి వైదొలగడం వల్ల 15వ అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ను ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఏజీ వేణుగోపాల్‌ పదవీకాలాన్ని పొడిగించారు. అది కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. ఆయన ఈ పదవిలో దాదాపు 5ఏళ్లుగా కొనసాగుతున్నారు.

2020లోనే వేణుగోపాల్‌ మూడేళ్ల పదవీకాలం ముగిసింది. అప్పటికే ఆయన వయస్సు దాదాపు 89 ఏళ్లు. తన వయస్సును దృష్టిలో పెట్టుకొని విశ్రాంతిని ఇవ్వాలని అప్పట్లో వేణుగోపాల్‌ కేంద్రాన్ని కోరారు. కానీ, కేంద్రం ఆయన్ను మరో మూడేళ్లపాటు పదవిలో కొనసాగమని అభ్యర్థించడం వల్ల ఆయన కొనసాగారు. ముకుల్‌ రోహత్గి పదవీకాలం అక్టోబర్‌ 1 నుంచి మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details