పంజాబ్లోని రూప్నగర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, బీఎస్పీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీని ఉత్తర్ప్రదేశ్ పోలీసులు మంగళవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. యూపీలోని మౌకు చెందిన అన్సారీ దాదాపు 52 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. వీటిలో 15 కేసులు విచారణ దశలో ఉన్నాయి.
యూపీ పోలీసుల కస్టడీలో ముక్తార్ అన్సారీ - ముక్తార్ అన్సారీ
50కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీని అదుపులోకి తీసుకున్నారు యూపీ పోలీసులు. ఆయనను బందా జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
యూపీ పోలీసుల కస్టడీలోకి ముక్తార్ అన్సారీ
2019 నుంచి రూప్నగర్ జైలులో ఉన్న అన్సారీని యూపీలో బందా జైలుకు తరలించినట్లు పంజాబ్ అదనపు డైరెక్టర్ జనరల్ (జైళ్లు) ప్రవీణ్ కుమార్ సిన్హా వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్సారీని యూపీ పోలీసులకు అప్పగించినట్లు పోలీసులకు తెలిపారు. మరోవైపు తన భర్త ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ.. ముక్తార్ అన్సారీ భార్య అప్షాన్ అన్సారీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదీ చూడండి:'రఫేల్ ముడుపుల ఆరోపణలు నిరాధారం'