మరోసారి తాత అయిన ముకేశ్ అంబానీ.. కవలలకు జన్మనిచ్చిన ఇషా.. పేర్లు ఇవే!
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ.. కవల పిల్లలకు జన్మనిచ్చారు. వీరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. వీరిద్దరికీ పేర్లు సైతం ఖరారు చేశారు.
ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవలలకు జన్మనిచ్చారు. ఈ కవలల్లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అమ్మాయికి ఆదియా అని, అబ్బాయికి కృష్ణా అని నామకరణం చేసినట్లు అంబానీ కుటుంబం తెలిపింది. 2018లో రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి ఆనంద్ పిరమిల్‌తో వివాహం జరిగింది. ఇషా, ఆనంద్ దంపతులు శనివారం కవలలకు జన్మనిచ్చినట్లు అంబానీ కుటుంబం తాజాగా వెల్లడించింది. ఈ శుభసమయంలో అందరి ఆశీస్సులు కావాలని పేర్కొన్నారు. వీరు ఎక్కడ జన్మించారని వీరు స్పష్టత ఇవ్వలేదు. అయితే, ప్రస్తుతం ఇషా అమెరికాలో ఉన్నారని, అక్కడే కవలలకు జన్మనిచ్చారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ముకేశ్ కుమారుడు ఆకాశ్ అంబానీకి గతంలో ఓ కుమారుడు జన్మించారు. దీంతో తాజాగా ముకేశ్ రెండోసారి తాత అయినట్లైంది. ముఖేశ్ అంబానీకి ముగ్గురు సంతానం కాగా ఆకాశ్, ఈశాలు(31) కవలలు, మరో కుమారుడు అనంత్ (27).