తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పైథాన్​ల వ్యాపారం.. ఒక్కోటి రూ.4లక్షలకు విక్రయం.. కొనాలని ఉందా?

కేరళకు చెందిన ఓ యువకుడు వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టాడు. మహ్మద్ హీషాం అనే యువకుడు కొండచిలువలను పెంచుతున్నాడు. వాటితో వ్యాపారం కూడా చేస్తున్నాడు. అసలు ఈ కథెంటో ఓ సారి తెలుసుకుందాం.

african pythons cultivation
కొండచిలువలను పెంచుతున్న యువకుడు

By

Published : Oct 15, 2022, 8:13 PM IST

పైథాన్​లను పెంచుతున్న యువకుడు

సరదా కోసం కుక్కలు, పిల్లులను పెంచుకోవడం సాధారణమైన విషయమే. అయితే కేరళలోని కన్నూర్​కు చెందిన మహ్మద్ హీషాం అనే యువకుడు మాత్రం కొండచిలువలను పెంచుకుంటున్నాడు. వాటితో వ్యాపారం కూడా చేస్తున్నాడు. కేరళలో ఇప్పుడిప్పుడే పైథాన్‌లను పెంచుకునే వారి సంఖ్య పెరిగిపోతోందని అతను చెబుతున్నాడు. డిమాండ్‌ను బట్టి ఒక్కో పైథాన్‌ రూ.25 వేల నుంచి రూ.4 లక్షల వరకు అమ్ముతుంటానని మహ్మద్ హీషాం వివరించాడు.

.
అరుదైన పక్షులను పెంచుతున్న యువకుడు

కేరళ ప్రభుత్వం నుంచి ఇలాంటి సర్పాలను పెంచుకోటానికి.. అనుమతి లేకపోయినప్పటికీ, నిషేధం కూడా లేకపోవడం వల్ల వీటికి డిమాండ్‌ పెరుగుతోందని యువకుడు వివరించాడు. ఎవరికైనా ఈ విషరహిత సర్పాలు కావాలంటే పరివేశ్‌ అనే యాప్‌ ద్వారా నమోదు చేసుకోవాలని.. తర్వాతే వాటిని తీసుకొస్తానని తెలిపాడు. ఆ పైథాన్‌లకు ఆహారం కోసం ఎలుకలను ప్రత్యేక బోనులలో పెంచుతున్నాడు. కొండచిలువలతో పాటు అరుదైన పక్షులను పెంచుతున్నట్లు హీషాం వివరించాడు.

.

ABOUT THE AUTHOR

...view details