తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ముంచెత్తిన మంచు- రాకపోకలకు అంతరాయం - కశ్మీర్​ మంచులో ఇరుక్కున్న వర్కర్లు

కశ్మీర్​లోని పలు ప్రాంతాలను మంచు కమ్మేసింది. శనివారం కురిసిన భారీ మంచు కారణంగా మొఘల్​ రోడ్​పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సీజన్​లో మంచు కురవడం ఇదే తొలిసారి.

Kashmir_snowfall
కశ్మీర్​లో కురుస్తోన్న మంచు ... 10 మందిని రక్షించిన పోలీసులు

By

Published : Nov 14, 2020, 8:45 PM IST

కశ్మీర్​లో కురుస్తోన్న మంచు

కశ్మీర్​లోని పలు ప్రాంతాలను హిమపాతం కప్పేసింది. ఈ సీజన్​లో తొలిసారి కురిసిన మంచు కారణంగా.. పీర్​పంజాల్ పర్యటక ప్రాంతం సమీపంలోని మొఘల్​ రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 86 కిలోమీటర్ల మేర రహదారిపై మంచు పేరుకుపోయింది.

10 మందిని కాపాడిన పోలీసులు..

దక్షిణ కశ్మీర్​ షోపియాన్​ కొండ ప్రాంతంలోని మొఘల్​ రోడ్ సమీపంలో విద్యుత్​ స్తంభాలు ఏర్పాటు చేస్తూ కొందరు కూలీలు మంచులో ఇరుక్కు పోయారు. వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. దాదాపు 10 మందిని కాపాడినట్లు తెలిపారు.

కశ్మీర్​లోని మొఘల్​ రోడ్​తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ శనివారం నుంచి మంచు భారీగా కురుస్తోంది.

ఇదీ చదవండి:మరో ఏడాది పాటు ఈడీ డైరెక్టర్​గా ఎస్​కే మిశ్రా

ABOUT THE AUTHOR

...view details