తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Mps and Mlas Corruption Supreme Court : చట్టసభల్లో అవినీతికి పాల్పడే ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపు!.. సుప్రీం కీలక వ్యాఖ్యలు - చట్టసభల్లో అవినీతికి పాల్పడే కేసు సుప్రీంకోర్టు

Mps and Mlas Corruption Supreme Court : పార్లమెంటు, శాసనసభల సభ్యులు ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపునిస్తూ 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించేందుకు అంగీకరించింది. ఇందుకోసం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చీఫ్‌ జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది.

Mps and Mlas Corruption Supreme Court
Mps and Mlas Corruption Supreme Court

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 8:02 AM IST

Updated : Sep 21, 2023, 9:15 AM IST

Mps and Mlas Corruption Supreme Court : చట్టసభల్లో అవినీతి చర్యలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపునిస్తూ 1998లో వెలువడిన తీర్పును పునఃపరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇందుకోసం ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం ఈ విషయాన్ని తెలిపింది.

JMM Bribery Supreme Court Judgement : కొన్నేళ్ల క్రితం జరిగిన ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా అవినీతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012 రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యురాలు సీతా సోరెన్‌ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకుని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రిమినల్‌ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత ఝార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ తిరస్కరించడం వల్ల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా? వారికి రక్షణ ఉంటుందా? అనే అంశాన్ని 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసుకు ఎంతో ప్రాముఖ్యం ఉందంటూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. తాజాగా ఆ కేసును పరిశీలించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పి.వి.నరసింహారావు వర్సెస్‌ సీబీఐ కేసులో 1998లో వెలువడిన తీర్పును పునఃపరిశీలిస్తామని తెలిపింది. రాజకీయ నైతికతపై ప్రభావం చూపే ఈ అంశం ముఖ్యమైనదేనని అభిప్రాయపడుతూ ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.

National Judicial Data Grid Supreme Court : సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు, పరిష్కారమైన కేసుల వివరాలు ఇకపై ఆన్​లైన్​లో అందుబాటులో ఉండనున్నాయి. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ పోర్టల్(ఎన్​జేడీజీ)​కు సుప్రీంకోర్టును త్వరలో అనుసంధానిస్తామని సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్ ఇటీవల ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఇప్పటివరకు కింది స్థాయి కోర్టుల నుంచి హైకోర్టు డేటాను పొందుపరిచే ఎన్​జేడీజీ పోర్టల్​లో త్వరలో సుప్రీంకోర్టుల కేసుల వివరాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Shiv Sena Dispute Supreme Court : 'వారంలోగా నిర్ణయం తీసుకోవాలి'.. శిందే వర్గం ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం

Amicus Curiae On Convicted Representatives : 'ఆ కేసుల్లో శిక్షపడితే శాశ్వతంగా చట్టసభల్లో నిషేధించాలి'.. సుప్రీం కోర్టుకు నివేదిక..

Last Updated : Sep 21, 2023, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details