ప్రపంచవ్యాప్తంగా మామిడి పండుకు ఎంతో ఆదరణ ఉంది. అందుకే దీనిని అన్ని ఫలాలకు రారాజుగా అని పిలుస్తారు. మామిడిలో వివిధ రకాల ఉన్నాయి. అయితే మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో సంకల్ప్, రాణి పరిహార్ దంపతులు పండించే మామిడి పండ్లు కేజీ సుమారు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ధర పలుకుతాయి. జపాన్‌లో ఎక్కువగా పండించే 'టాయో నో టామ్గావ్' రకానికి చెందిన మామిడి పండ్లను ప్రస్తుతం పరిహార్ దంపతులు సాగు చేస్తున్నారు.
జబల్‌పుర్‌లోని చార్గ్వన్ రోడ్డు ప్రాంతంలో ఉన్న పరిహార్ దంపతుల గార్డెన్లో సుమారు 14 రకాల మామిడి పండ్లు దర్శనమిస్తాయి. ఈ సాగును వీరు గత నాలుగేళ్లగా చేస్తున్నారు. 'టాయో నో టామ్గావ్' రకానికి చెందిన ఈ చెట్లల్లో ఒక్కో చెట్టుకు 20 పండ్లు కాస్తాయని రాణి పరిహార్ తెలిపారు.
"ఈ సాగు చేయడానికి చాలా సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చింది. తక్కువ దిగుబడి ఉండటం వల్ల మొదట దీని కొనుగోలుకు ఎవరూ మొగ్గు చూపేవారు కాదు. కానీ క్రమంగా దీనికి డిమాండ్ పెరిగింది. జపాన్‌లో ఈ పండ్లను బహిరంగ ప్రదేశాల్లో పండించరు. కానీ భారత్‌లో బహిరంగ ప్రదేశాల్లో సాగు చేసేందుకు కూడా వాతావరణం అనుకూలంగా ఉంది. వీటిలో ఎలాంటి పీచు పదార్థం ఉండటమే కాక పండు కూడా చాలా రుచిగా ఉంటుంది."
-రాణి పరిహార్
2కేజీల మామిడి పండు..