మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఓ జిమ్‌లో విస్తుపోయే సంఘటన జరిగింది. తన భర్త ఓ మహిళను ప్రేమిస్తున్నాడని అనుమానిస్తూ.. చెప్పులతో దాడికి దిగింది భార్య. భర్తను, ఆ మహిళను చెప్పులతో చితకబాదింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఓ మహిళ(30) తన సోదరితో కలిసి ఆమె భర్త కసరత్తులు చేస్తున్న జిమ్‌కు వెళ్లింది. భర్తతో ప్రేమలో ఉందని అనుమానిస్తున్న మహిళ కూడా అక్కడే ఉంది. ఒక్కసారిగా చెప్పులు చేతపట్టుకుని భర్త, పక్కనున్న మహిళపై దాడికి దిగింది. జిమ్‌లో ఉన్నవారందరూ ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.