ఓ యువతికి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ శహడోల్ జిల్లాలో జరిగింది. బాధితురాలిని అపహరించిన నలుగురు కిరాతకులు.. వాహనంలో జైత్‌పుర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గడఘాట్ ప్రాంతంలోని ఫాంహౌస్‌కి తీసుకెళ్లారు. రెండు రోజుల(ఫిబ్రవరి18,19)పాటు చిత్రహింసలకు గురి చేసి అఘాయిత్యానికి ఒడిగట్టారని ఏఎస్పీ ముకేశ్ వైశ్ తెలిపారు.
మరుసటి రోజు(ఫిబ్రవరి 20న) బాధితురాలిని ఆమె ఇంటి ముందే దించి వెళ్లారని ముకేశ్ పేర్కొన్నారు. ఆమెను తొలుత జైత్‌పుర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లినట్లు పేర్కొన్న ఏఎస్పీ.. అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.