మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో కొవిడ్ వ్యాధిగ్రస్థుడికి ఉన్న ఆక్సిజన్ కనెక్షన్‌ను వార్డు బాయ్ తొలగించాడు. దాంతో.. సదరు రోగి విలవిల్లాడుతూ మృతి చెందాడు. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
కరోనాతో రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన సురేంద్ర శర్మ అనే రోగి బుధవారం ప్రాణాలు కోల్పోయాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
''మా తండ్రి శ్వాస సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆసుపత్రి వైద్యులు ఆక్సిజన్ అందించారు. కానీ మంగళవారం రాత్రి మా నాన్నకు ఆక్సిజన్‌ను తొలగించారు. ఆక్సిజన్‌ను అందించాలని నేను అక్కడికి వెళ్లి ప్రాధేయపడ్డాను. కానీ ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. శ్వాస అందకనే మా తండ్రి మరణించారు.''