తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒంటినిండా రోమాలు.. తోడేలును తలపించేలా ముఖం.. ఇప్పటివరకు 50 మందికే ఇలా..

ఒళ్లంతా రోమాలు వచ్చే వింత వ్యాధితో బాధపడుతున్నాడు ఓ యువకుడు. 500 ఏళ్లలో 50 మందికి మాత్రమే వచ్చిన అరుదైన వ్యాధితో.. అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నాడు. అసలెవరా యువకుడు? అంత అరుదైన వ్యాధి ఏంటి?

lalit-patidar-werewolf-syndrome
లలిత్ పాటిదార్ వేర్​ఉల్ఫ్ సిండ్రోమ్

By

Published : Nov 24, 2022, 4:54 PM IST

Updated : Nov 24, 2022, 6:07 PM IST

ఒళ్లంతా వెంట్రుకలు.. ముఖాన్ని కప్పేసేలా రోమాలు.. చూస్తేనే భయం కలిగించే తోడేలు రూపం.. అత్యంత అరుదుగా వచ్చే వేర్​ఉల్ఫ్ సిండ్రోమ్ వ్యాధి లక్షణాలివి. మధ్యప్రదేశ్​లోని లలిత్ పాటిదార్ అనే 17ఏళ్ల యువకుడు ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. తల నుంచి కాలిగోటి వరకు.. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వెంట్రుకలతో సతమవతమవుతున్నాడు. పుట్టినప్పటి నుంచి తన శరీరంపై వెంట్రుకలు అధికంగానే ఉంటున్నాయని చెబుతున్నాడు.

రత్లాం జిల్లాలోని నంద్లేటా గ్రామంలో నివసించే లలిత్​కు వచ్చిన ఈ వ్యాధి చాలా అరుదైనది. 15వ శతాబ్దం తర్వాత 50 మందికి మాత్రమే ఇలాంటి వ్యాధి వచ్చింది. ఈ సిండ్రోమ్ ఉన్నవారికి.. ఒళ్లంతా వెంట్రుకలు పెరుగుతాయి. ఎన్నిసార్లు కత్తిరించినా మళ్లీ వెంట్రుకలు వస్తుంటాయి. ప్రస్తుతం పన్నెండో తరగతి చదువుతున్న లలిత్​.. పుట్టినప్పుడే ఒళ్లంతా వెంట్రుకలతో పుట్టాడు. సాధారణ రోమాలే అనుకొని వైద్యులు.. అప్పుడే వాటిని తొలగించారు. కానీ ఏడేళ్లు వచ్చేసరికి లలిత్ శరీరం అంతా వెంట్రుకలు పెరిగాయి. వెంటనే అతడి తల్లిదండ్రులు.. వైద్యుడిని సంప్రదించారు. అప్పుడే వేర్​వుల్ఫ్ అనే హైపర్​ట్రికోసిస్ వ్యాధి ఉందని వీరికి తెలిసింది.

చిన్నారితో లలిత్

ప్రారంభంలో.. లలిత్ ఆహార్యం చూసి స్థానికులు చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఊర్లోని ఇతర పిల్లలు తనను చూసి భయపడేవారని, రాళ్లతో కొట్టేవారని లలిత్ చెబుతున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని లలిత్ తాతయ్య భవల్లాల్ వివరిస్తున్నారు. "చికిత్స గురించి మేమెలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఉదయ్​పుర్ తీసుకెళ్లి వైద్యులను సంప్రదించాం. హార్మోన్లు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. గ్రామంలోని ప్రజలంతా భయపడేవారు. కొందరు హనుమంతుడు అని పిలిచేవారు. ఆ తర్వాత అంతా సాధారణమైపోయింది. తెలిసినవారంతా మామూలుగానే మాట్లాడేవారు" అని లలిత్ తాతయ్య భవల్లాల్ పాటిదార్ చెబుతున్నారు.

లలిత్

చికిత్స సాధ్యమే
లలిత్ కుటుంబంలో ఎవరికీ ఈ వ్యాధి లేదు. తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు. తల్లి గృహిణి. ఖాళీ సమయాల్లో తండ్రికి పొలం పనుల్లో సాయం చేసే లలిత్.. టెక్నాలజీ, కంప్యూటర్లు అంటే తనకు ఇష్టమని చెబుతున్నాడు. మంచి యూట్యూబర్​గా రాణించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే సమస్య నయమవుతుందని.. ఇందుకోసం 21 ఏళ్లు వచ్చేవరకు ఆగాలని వైద్యులు లలిత్​కు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన చికిత్స కోసం సహాయం చేయాలని లలిత్ వేడుకుంటున్నాడు.

Last Updated : Nov 24, 2022, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details