మధ్యప్రదేశ్ సిధి జిల్లాలో(sidhi news today) అత్యంత పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 15ఏళ్ల బాలికను నలుగురు సామూహిక అత్యాచారం చేసి(crime news today).. అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆమె ఛాతిపై కాలుతున్న సిగరెట్‌ను రుద్ది పైశాచికానందాన్ని పొందారు. అంతటితో ఆగకుండా చెట్టుకు వేలాడదీసి ఆమె ప్రాణాలు తీశారు. జిల్లావ్యాప్తంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.(crime news india)
కిడ్నాప్ చేసి..
సిధి జిల్లాలోని ఓ గ్రామంలో(mp crime news) సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో.. సోదరుడిని పాఠశాలలో దింపేందుకు ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లింది. తమ్ముడిని దింపిన అనంతరం వెనక్కి తిరిగివస్తుండగా.. నలుగురు ఆమెను అడ్డుకున్నారు. బలవంతం చేసి వారి బైక్ మీద ఎక్కించుకుని అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.