తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రీయ విద్యాలయాల్లో ఆ కోటా సీట్లు రద్దు - kendriya-vidyalaya

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక సీట్ల కోటా రద్దు అయింది. ఎంపీ సీట్లు సహా ఇతర కోటాల కింద సీట్లను భర్తీ చేసే ప్రక్రియను కూడా రద్దు చేస్తున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్​ ఉత్తర్వులు జారీ చేసింది.

mp-seats-quota-cancelled-in-kendriya-vidyalayas
కేంద్రీయ విద్యాలయాల్లో ఆ కోటా సీట్లు రద్దు

By

Published : Apr 13, 2022, 5:19 PM IST

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై ఎంపీ కోటా సీట్లను రద్దు చేస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటివరకు ఏటా ఒక్కో ఎంపీకి 10 సీట్లు కేటాయించింది కేవీఎస్​. ఈ కోటాలో సీట్ల సంఖ్యను మరింత పెంచాలని ఎంపీలు గతకొంతకాలంగా డిమాండ్లు చేస్తున్న తరుణంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎంపీలతో పాటు ఇతర కోటాల కింద సీట్లను భర్తీ చేసే ప్రక్రియను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details