తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్క నెల కరెంట్ బిల్లు రూ.3వేల కోట్లు.. ఆస్పత్రిలో ఇంటి ఓనర్​! - మధ్యప్రదేశ్​ కరెంట్​ బిల్​

మధ్యప్రదేశ్‌లో ఓ ఇంటికి జులై నెల కరెంట్ బిల్లు రూ.3,419 కోట్లు వచ్చింది. దీంతో అది చూసి ఇంటి యజమాని షాక్​కు గురై ఆసుపత్రి పాలయ్యాడు. అయితే ఇది మానవ తప్పిదమని, పొరపాటును సరి చేశామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

mp-rs-3419-crore-power-bill-shocks-consumer-amount-reduced-to-rs-1300-after-correction
mp-rs-3419-crore-power-bill-shocks-consumer-amount-reduced-to-rs-1300-after-correction

By

Published : Jul 27, 2022, 7:35 AM IST

Electricity Bill: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌ నగర శివ్‌విహార్‌ కాలనీలో నివాసం ఉంటున్న ప్రియాంక గుప్తా కుటుంబం అయిదారు రోజుల కిందట తమ ఇంటికి వచ్చిన విద్యుత్తు బిల్లును చూసి కళ్లు తేలేసింది. రూ.3,419 కోట్ల విద్యుత్తు బిల్లు చూసిన ఆ ఇంటిపెద్ద (ప్రియాంక మామ) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రియాంక గుప్తా భర్త సంజీవ్‌ కంకణె మాట్లాడుతూ.. జులై 20న వచ్చిన ఈ బిల్లును విద్యుత్తుశాఖ పోర్టల్‌ ద్వారా పరిశీలించినా అంతే మొత్తం ఉన్నట్లు వచ్చిందన్నారు. విషయాన్ని స్టేట్‌ పవర్‌ కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా, జరిగిన పొరపాటును గుర్తించి రూ.1,300గా సవరించారు.

ఇంతకూ ఏం జరిగిందంటే.. విద్యుత్తు బిల్లు పంపిణీకి వచ్చిన ఉద్యోగి సాఫ్ట్‌వేర్‌లో 'యూనిట్లు' అని ఉన్నచోట పొరపాటున వినియోగదారు సంఖ్యను రాశారు. దీంతో బిల్లు రూ.కోట్లలోకి వెళ్లి కొండెక్కింది. సంబంధిత విద్యుత్తు ఉద్యోగిపై చర్య తీసుకుంటామని విద్యుత్తుశాఖ మంత్రి ప్రద్యుమ్నసింగ్‌ తోమర్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details