తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసులపై సీఎం వరాలు.. రొటేషనల్ వీకాఫ్.. 15 లీటర్ల పెట్రోల్ ఫ్రీ.. అర్హుల కోసం 25వేల ఇళ్లు - పోలీసులకు బీజేపీ హామీలు

MP Police Shivraj Singh Chouhan News : రాష్ట్ర పోలీసులకు గుడ్​న్యూస్ చెప్పింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. రొటేషన్ పద్దతిలో పోలీసులకు వారాంతపు సెలవు ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ తెలిపారు. అలాగే ప్రభుత్వ వాహన సదుపాంలేని స్టేషన్​లకు పోలీసులకు నెలకు 15 లీటర్ల పెట్రోల్ ఇస్తామని ప్రకటించారు. శుక్రవారం భోపాల్​లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం ఈ ఈ వరాలను ప్రకటించారు.

mp police shivraj singh chouhan news
mp police shivraj singh chouhan news

By

Published : Jul 29, 2023, 1:13 PM IST

MP Police Shivraj Singh Chouhan News : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఆ రాష్ట్ర పోలీసులపై వరాల జల్లు కురిపించారు. రొటేషన్ పద్దతిలో పోలీసులకు వారాంతపు సెలవు(వీక్లీ ఆఫ్) ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ వాహనం సదుపాయంలేని స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసులందరికీ నెలకు 15 లీటర్ల పెట్రోలు ఉచితంగా ఇస్తామని తెలిపారు. 45 ఏళ్లు పైబడిన పోలీసులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తామని శివరాజ్ సింగ్ హామీ ఇచ్చారు.

పోలీసుల పౌష్ఠికాహార భత్యాన్ని రూ.650 నుంచి రూ. 1,000కి పెంచుతున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ప్రకటించారు. అలాగే విధులు నిర్వర్తించే సమయంలో ఇచ్చే భోజనం అలవెన్స్​ను రోజుకు రూ.70 నుంచి రూ.100కు పెంచుతున్నామని చెప్పారు. యూనిఫాం అలవెన్స్‌ను రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర పోలీసుల కోసం 25 వేల ఇళ్లను నిర్మిస్తామని.. అవి అర్హులైనవారికి అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు పోలీసుల కుటుంబాలతో భోపాల్​లోని తన అధికారిక నివాసంలో సమావేశమైన అనంతరం ఈ వరాలు ప్రకటించారు శివరాజ్ సింగ్ చౌహాన్​. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్ర, రాష్ట్ర డీజీపీ సుధీర్ కుమార్ సక్సేనా, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

"రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. పోలీసులంటే నాకు చాలా గౌరవం. మధ్యప్రదేశ్‌లో పోలీసు రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం. మహిళా పోలీసులు విధులను చక్కగా నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులను అభినందిస్తున్నా. పోలీసులు పగలురాత్రి అనే తేడా లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారు."
-శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

Madhya Pradesh Assembly Election 2023 : ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్​లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఉద్యోగులు, ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ సర్కార్.. హామీలు కురిపిస్తోంది. ఉచిత హామీలతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఫలితంగా ఇప్పుడే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details