తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పన్నా టైగర్ రిజర్వులో ఆడపులి మృతి - పన్నా జాతీయ పార్కు

మధ్యప్రదేశ్​లోని పన్నా టైగర్ రిజర్వులో ఓ ఆడపులి మరణించింది. పులి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. నమూనాలను కరోనా పరీక్షలకోసం పంపించామన్నారు.

Tigress died in Panna Tiger Reserve, feared to be corona infected
పన్నా టైగర్ రిజర్వులో ఆడపులి మృతి

By

Published : May 17, 2021, 12:32 PM IST

మధ్యప్రదేశ్​లోని పన్నా టైగర్​ రిజర్వులో ఓ ఆడపులి మరణించింది. పులికి పంచనామా నిర్వహించి.. నమూనాలను కరోనా పరీక్షలకు పంపించామని అధికారులు తెలిపారు. పీ-213(32) ఆడపులి ఎడమ కాలుకు కొంతకాలం క్రితం గాయమైందని.. దీంతో పులి నడవలేని స్థితికి వచ్చిందన్నారు. ఆడపులికి నాలుగు పిల్లలు ఉన్నాయని వివరించారు. ఆడపులికి టైగర్​ రిజర్వులోనే అంత్యక్రియలు నిర్వహించినట్లు ఫీల్డ్​ డైరెక్టర్ ఉత్తమ్ కుమార్​ శర్మ తెలిపారు.

పన్నా టైగర్​ రిజర్వు
మృతి చెందిన ఆడపులి..

పులి మృతికి కారణాలు తెలియకపోవటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతర పులులను సంరక్షించేందుకు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి :జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు తీవ్రవాదులు హతం

ABOUT THE AUTHOR

...view details