మధ్యప్రదేశ్ ఇందోర్‌లో అమానుష ఘటన వెలుగు చూసింది. అభంశుభం తెలియని ఏడాది వయసు చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొందరు కిరాతకులు. తల్లి వద్ద నిద్రిస్తున్న సమయంలో చిన్నారిని ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు.
అసలేం జరిగింది?
ఇందోర్ తీన్ ఇమ్లీ ప్రాంతంలోని ఓ వంతెన కింద... సోమవారం రాత్రి ఓ చిన్నారి(1) తన తల్లి పక్కన నిద్రిస్తోంది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని అపహరించారు. ఘటనాస్థలి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజీవ్‌గాంధీ స్క్వేర్ ప్రాంతంలో మరుసటి రోజు ఆమెను దుండగులు వదిలిపెట్టారు. ఈ మేరకు ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇంద్రేశ్ త్రిపాఠి తెలిపారు. లైంగిక వేధింపులకు గురైనట్లుగా చిన్నారి శరీరంపై గాయాలున్నాయని వైద్య నివేదికలో తేలిందని చెప్పారు.