తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ మామిడి పండ్లు తినాలంటే ఆస్తులమ్ముకోవాలి! - నూర్‌జహాన్ మామిడి పండ్లపై కరోనా ప్రభావం

నూర్​జహాన్​ రకం మామిడి కాయలకు భలే డిమాండ్​ ఉంటుంది. అందు​కు తగ్గట్టుగానే వాటి ధర కూడా ఆదరహా అనిపిస్తుంది. ఇంతకీ ఒక్కో పండు ధర ఎంత అంటారా? అక్షరాలా రూ.వెయ్యి.

Noorjahan mangoes, mango cost rs.1,000
నూర్‌జహాన్ మామిడి

By

Published : Jun 6, 2021, 6:02 PM IST

Updated : Jun 6, 2021, 6:36 PM IST

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పుర్ జిల్లాలో పండించే 'నూర్‌జహాన్' మామిడి పండ్ల రకానికి ఈ ఏడాది మంచి దిగుబడి లభించింది. గతేడాతో పోల్చితే ఈసారి పండ్ల పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల అధిక ధర పలుకుతోంది. ఈ వేసవి సీజన్​లో మాత్రమే దొరికే 'నూర్‌జహాన్' మామిడి పండు ఒక్కోదాని ధర రూ .500 నుంచి రూ .1,000 వరకు ఉంటుందని స్థానిక రైతులు చెబుతున్నారు.

"ఈ నూర్​జహాన్​ రకానికి మంచి డిమాండ్​ ఉంటుంది. ఈ మామిడి పండ్లను ముందుగానే బుక్ చేసుకుంటారు. మధ్యప్రదేశ్‌తో పాటు పొరుగునుండే గుజరాత్‌కు చెందిన పండ్ల ప్రేమికులు వీటి కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. ఇవి కేవలం గుజరాత్​ సరిహద్దులో ఉన్న అలీరాజ్​పుర్​లోని కత్తివాడ ప్రాంతంలోనే సాగు అవుతాయి. నాకు మూడు నూర్​జహాన్​ రకం మామిడి చెట్లు ఉన్నాయి. అవి ఇప్పుడు 250 కాయలు కాసాయి. ఒక్కో పండు బరువు 2 నుంచి 3.5 కేజీలు ఉంటుంది."

- శివరాజ్​ సింగ్ జాదవ్​, రైతు

గతేడాది నూర్​జహాన్​ రకం మామిడి పండ్ల వ్యాపారంపైనా కరోనా ప్రభావం పడిందని అన్నారు ఈ రకాన్ని సాగుచేస్తున్న వారిలో ఒకరైన ఇషాక్​ మన్సూరీ.

"2020లో ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ రకం మామిడి చెట్లు సరిగా పూత పూయలేదు. 2019 లో ఈ రకం మామిడి ఒకటి సగటున 2.75 కిలోలు తూగాయి. వీటి కోసం కొనుగోలుదారులు రూ. 1,200 వెచ్చించారు. జనవరి, ఫిబ్రవరిలో ఈ చెట్లు పూత పూస్తాయి. జూన్ ప్రారంభంలో పండ్లు చేతికొస్తాయి. ఈ మామిడి కాయలు ఒక్కొక్కటి అడుగు మేర పొడువు ఉంటాయి. లోపల ఉండే ముట్టి సుమారు 150 నుంచి 200 గ్రాముల బరువు ఉంటుంది."

-ఇషాక్​ మన్సూరీ, రైతు

ఇదీ చూడండి:ఇదొక సూపర్​ స్పెషల్ బీర్- ధర రూ.60!

Last Updated : Jun 6, 2021, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details