తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Minor Vaccine: మైనర్​కు కరోనా టీకా- పరిస్థితి ఆందోళనకరం!

వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తప్పిదం జరిగిందని సమాచారం. మధ్యప్రదేశ్​లో ఓ మైనర్​కు కరోనా టీకా (minor vaccine) వేసినట్లు తెలుస్తోంది. దీంతో అతడు అస్వస్థతకు గురయ్యాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

minor vaccine
కరోనా వైరస్ టీకా తాజా వార్తలు

By

Published : Aug 29, 2021, 3:46 PM IST

కరోనా టీకా తీసుకున్న ఓ 16ఏళ్ల బాలుడు (minor vaccine) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని మొరెనా జిల్లాలో జరిగింది. మైనర్లకు టీకా కార్యక్రమం (vaccine for under 18) ప్రారంభం కానప్పటికీ సదరు బాలుడికి టీకా ఎలా ఇచ్చారనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ఎక్కడ? ఎలా?

అంబా తాలుకాలోని బాగ్​కా పురకు చెందిన కమ్​లేశ్ కుష్వాహా కుమారుడు పిల్లుకు ఓ కేంద్రంలో శనివారం టీకా వేశారు. ఆ తర్వాత అతనికి తల తిరగడం సహా నోటి నుంచి నురగ వచ్చిందని సమాచారం. దీంతో ఆంబాలోని వైద్యులు చికిత్స కోసం అతడిని గ్వాలియర్​ వెళ్లమని సూచించారు.

ఈ ఘటనతో వ్యాక్సిన్ కేంద్రం వద్ద గొడవకు దిగారు పిల్లు కుటుంబ సభ్యులు.

అయితే పిల్లు గ్వాలియర్​కు వెళ్లాడా లేదా అని తెలుసుకుంటున్నట్లు జిల్లా ముఖ్య వైద్య, ఆరోగ్య అధికారి డా.ఎ.డి. శర్మ తెలిపారు. అతడు ఆస్పత్రికి కాకుండా ఇంటికే వెళ్లినట్లు తమకు తెలిసిందని అన్నారు.

మైనర్​కు టీకా ఎలా వేశారు అని తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్లు డా. శర్మ తెలిపారు. పిల్లు ఆధార్​ కార్డును పరిశీలిస్తామని చెప్పారు. పిల్లు ఆధార్​ కార్డులో అతడి పుట్టిన రోజు 2005 జనవరి 1గా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

త్వరలోనే చిన్నారులకూ టీకా!

12 ఏళ్లు పైబడినవారి కోసం దేశీయంగా జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చెందిన జైకోవ్‌-డి టీకా అత్యవసర వినియోగానికి ఇదివరకే అనుమితించిందిడీజీసీఐ. మిగతా టీకాలకు భిన్నంగా దీన్ని 3 డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వయసువారికి దేశంలో అందుబాటులోకి వచ్చిన మొదటి కొవిడ్‌ టీకా ఇదే.

ఇదీ చూడండి:Zycov-D Vaccine: సెప్టెంబర్​ నుంచి జైకోవ్​-డి టీకా!

ABOUT THE AUTHOR

...view details