తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎంబీబీఎస్‌ పాఠాల్లో హెగ్డేవర్‌, దీన్‌ దయాళ్‌ - MP: MBBS 1st year students to now read about Hindutva icons, Ambedkar

మధ్యప్రదేశ్​లో ఎంబీబీఎస్‌ ఫౌండేషన్‌ కోర్సులో భాగంగా ఆరెస్సెస్‌ వ్యవస్థాపకుడు కేబీ హెగ్డేవర్‌, భారతీయ జనసంఘ్‌ నేత దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, స్వామి వివేకానంద, బీఆర్‌ అంబేడ్కర్‌ గురించి బోధించనున్నారు. వీరితో పాటు చరకుడు, సుశ్రుతుడు గురించి కూడా విద్యార్థులకు బోధించనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ తెలిపారు.

MBBS 1st year students to now read about Hindutva icons
ఎంబీబీఎస్‌ పాఠాల్లో హెగ్డేవర్‌

By

Published : Sep 6, 2021, 6:46 AM IST

ఎంబీబీఎస్‌ తొలి సంవత్సరం విద్యార్థులకు ఆరెస్సెస్‌ నేతలు, ఇతర మహనీయుల గురించి బోధించాలని మధ్యప్రదేశ్ సర్కారు నిర్ణయించింది. ఫౌండేషన్‌ కోర్సులో భాగంగా ఆరెస్సెస్‌ వ్యవస్థాపకుడు కేబీ హెగ్డేవర్‌, భారతీయ జనసంఘ్‌ నేత దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, స్వామి వివేకానంద, బీఆర్‌ అంబేడ్కర్‌ గురించి బోధించనున్నారు. వీరితో చరకుడు, సుశ్రుతుడు గురించి కూడా విద్యార్థులకు బోధించనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడంలో భాగంగా ఈ మహానుభావుల జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేరుస్తున్నట్లు చెప్పారు.

ఫౌండేషన్‌ కోర్సులో భాగంగా నైతిక విలువలు కూడా భాగం కావాలన్న జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సారంగ్‌ వివరించారు. ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠ్యాంశాలు బోధించనున్నట్లు చెప్పారు. ఏటా 2000 మంది విద్యార్థులు మధ్యప్రదేశ్‌లో ఎంబీబీఎస్‌లో చేరుతుంటారు. సర్కారు నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. 'హెగ్డేవర్‌, దీన్‌దయాళ్‌ మాత్రమే ఎందుకు? గాడ్సే గురించి కూడా బోధించాల్సింది' అంటూ పీసీసీ మాజీ అధ్యక్షుడు అరుణ్‌ యాదవ్‌ వ్యంగ్యంగా సర్కారును దుయ్యబట్టారు.

ఇదీ చూడండి:సర్వేపల్లి రాధాకృష్ణన్​ మనవడు కన్నుమూత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details