మధ్యప్రదేశ్ మంద్సౌర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌పై ఓ జంట నడిరోడ్డుపైనే దాడి చేసింది. బూతులు తిడుతూ, చెప్పులతో కొడుతూ వీరంగం సృష్టించింది. డిప్యూటీ కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
అలా చెప్పడమే తప్పు!: అరవింద్ మహోర్.. మంద్సౌర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. పిప్లియా మండీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనేందుకు కారులో వెళ్తున్నారు. మరోవైపు.. రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుకునే మోహన్ లాల్, అతడి భార్య భావన.. బైక్‌పై అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు. అయితే.. మోహన్ లాల్ ద్విచక్ర వాహనంపై రకరకాల విన్యాసాలు చేశాడు. డిప్యూటీ కలెక్టర్ కారుకు పదేపదే అడ్డం వచ్చాడు.
డిప్యూటీ కలెక్టర్‌కు చేదు అనుభవం.. నడిరోడ్డుపై చితకబాదిన భార్యాభర్తలు - Mandsaur latest news
రోడ్డుపై బైక్‌ను జాగ్రత్తగా నడపమని చెప్పిన డిప్యూటీ కలెక్టర్‌ను భార్యాభర్తలు రోడ్డుపైనే చితకబాదారు. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో జరిగిందీ ఘటన.
డిప్యూటీ కలెక్టర్‌కు చేదు అనుభవం.. నడిరోడ్డుపై చితకబాదిన భార్యాభర్తలు
ఓ దశలో డిప్యూటీ కలెక్టర్ వాహనం ఆపి.. మోహన్ లాల్‌తో మాట్లాడారు. బైక్‌పై స్టంట్స్ చేయకుండా, జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. వెంటనే మోహన్ లాల్, అతడి భార్య కోపోద్రిక్తులయ్యారు. 'మాకే చెబుతావా' అంటూ దాడికి తెగబడ్డారు. భావన.. డిప్యూటీ కలెక్టర్ కాలర్ పట్టుకుని చెప్పుతో కొట్టింది.
అరవింద్ ఫిర్యాదు మేరకు.. ఎస్సీ/ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సహా వేర్వేరు సెక్షన్ల కింద మంద్సౌర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేశారు.