తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో శ్రద్ధా వాకర్ తరహా ఘటన.. ప్రియురాలిని హత్య చేసి మృతదేహంతో వీడియో! - ప్రియురాలి హత్య

ప్రియురాలిని దారుణంగా హత్య చేసి మృతదేహంతో వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ ప్రియుడు. ఈ కిరాతక ఘటన నవంబర్​ 8న మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లోని ఓ రిసార్ట్​లో జరిగింది.

madhya pradesh girlfriend murder
madhya pradesh girlfriend murder

By

Published : Nov 16, 2022, 7:58 PM IST

దిల్లీలో శ్రద్ధా వాకర్ దారుణ హత్య మరువకముందే మరో ఘాతుకం జరిగింది. ప్రియురాలిని దారుణంగా హత్య చేసి మృతదేహంతో వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ ప్రియుడు. ఈ ఘటన నవంబర్​ 8న మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లోని ఓ రిసార్ట్​లో జరిగింది. నిందితుడిని పటాన్​కు చెందిన అభిజిత్​ పాటిదార్​గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన జరిగి వారం గడుస్తున్నా ఇప్పటికీ అతడిని అరెస్ట్ చేయలేదు.

ఈ వీడియోలో రక్తపు మడుగులో ఉన్న మృతురాలిని చూపిస్తూ తనను మోసం చేయవద్దంటూ నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. మృతురాలిని జబల్​పుర్​ జిల్లాలోని కుందాం ప్రాంతానికి చెందిన శిల్పా ఝరియా(22) గుర్తించామని చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. సాక్ష్యాలను సేకరించారు. నిందితుడు గుజరాత్​ నుంచి మధ్యప్రదేశ్​కు వలస వచ్చాడని.. ఇన్​స్ట్రాగ్రామ్​లో వీడియో పోస్ట్ చేశాడని వివరించారు. నిందితుడు ఆచూకీ లభించిందని.. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపించామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details