ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో ఓ సెక్స్ రాకెట్ గుట్టును (Sex Racket News) రట్టు చేశారు అక్కడి పోలీసులు. వ్యభిచార కూపం నుంచి 21 మంది యువతులను రక్షించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేయగా.. గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులకు గురువారం పట్టుబడ్డ ప్రధాన నిందితుడు మునిర్.. విస్తుపోయే విషయాలను వెల్లడించాడు. తాను ఇప్పటివరకు 75 మందిని వివాహం చేసుకున్నానని.. 200 మంది యువతులను భారత్‌లోకి (Human Trafficking in India) అక్రమ రవాణా చేశానని పేర్కొన్నాడు.
పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు బంగ్లాదేశ్ నుంచి మధ్యప్రదేశ్‌కు..
బంగ్లాదేశ్‌లోని జాసుర్‌కు చెందిన మునిర్ అలియాస్ మునిరుల్.. ఉపాధి నెపంతో ఆ దేశానికి చెందిన యువతులను భారత్‌లోకి అక్రమ రవాణా చేసేవాడు. ఇక్కడ వారిని వ్యభిచారంలోకి (Sex Racket News) దింపేవాడు. బంగాల్లోని ముర్షిదాబాద్ నుంచి మునిర్ భారత్‌లోకి (Human Trafficking in India) మహిళలను అక్రమ రవాణా చేసేవాడు. సరిహద్దులోని అధికారులకు రూ.25వేల చొప్పున లంచం ఇచ్చేవాడని పోలీసులు వెల్లడించారు.
ఈ క్రమంలో మునిర్ గత ఐదేళ్లలో 200 మంది యువతులను భారత్‌లోకి అక్రమ రవాణా చేశాడని.. ఇప్పటివరకు 75 మందిని వివాహం చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ముంబయి, కోల్‌కతా ప్రధాన కేంద్రాలుగా బంగ్లాదేశ్ నుంచి తీసుకువచ్చిన యువతులను వ్యభిచారంలోకి దింపేవాడని పేర్కొన్నారు. యువతులను దేశంలోని వివిధ పట్టణాలకు తరలించేవారని తెలిపారు.
ఇదీ చూడండి :సమీర్ వాంఖడే.. 'తెర'చాటు డ్రగ్స్‌పై ముంబయి 'సింగం'