తాను చనిపోయినట్లుగా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి.. రూ. కోటి బీమా పొందేందుకు యత్నించాడు ఓ ప్రబుద్ధుడు. దీనికి కుటుంబంతో పాటు ఓ వైద్యుడి సహకారం తోడైంది. చివరకు అసలు విషయం బయటపడగా... పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
ఏం జరిగిందంటే..?
మధ్యప్రదేశ్, దేవాస్‌కు చెందిన హనీఫ్(46).. 2019, సెప్టెంబర్‌లో ఓ కంపెనీ నుంచి రూ. కోటి బీమా కవర్ తీసుకున్నాడు. రెండు వాయిదాలు కట్టిన తర్వాత.. డాక్టర్. షకీర్ మన్సూరి అనే వైద్యుడి సాయంతో.. హనీఫ్ మృతిచెందినట్లుగా నకిలీ మరణపత్రాన్ని రూపొందించారు. హనీఫ్ మరణపత్రంతో అతని భార్య రెహానా, కుమారుడు ఇక్బాల్ రూ. కోటి బీమా క్లెయిమ్ చేసుకునేందుకు దరఖాస్తు పెట్టారు.