తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైకిల్​పై 13గంటల్లో 130 కి.మీ ప్రయాణం- ఎందుకంటే? - madhyapradesh agarwala

మధ్యప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి తన భార్య అంత్యక్రియలు నిర్వహించేందుకు 130 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణించాడు. 13 గంటల్లో తన భార్య గ్రామానికి చేరుకున్నట్లు తెలిపాడు.

Man cycles 130 kms. to perform last rites of wife
సైకిల్​పై 13 గంటల్లో 130 కిలోమీటలర్లు

By

Published : May 12, 2021, 8:34 PM IST

మధ్యప్రదేశ్​కు చెందిన రవిప్రసాద్ మాలి(58).. తన భార్య అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణించాడు. తన భార్య గ్రామానికి చేరుకునేందుకు 13 గంటలు పట్టిందని చెప్పుకొచ్చాడు.

సైకిల్​తో రవిప్రసాద్ మాలి

ఏం జరిగిందంటే?

మతిస్థిమితంలేని రవిప్రసాద్​ మాలి భార్య బబ్లీ.. మధ్యప్రదేశ్​ అగర్ మల్వాలోని తన సోదరుడి ఇంట్లో ఉంటుంది. అయితే మే 8న అనారోగ్య సమస్యలతో బబ్లీ మరణించింది. కరోనా కారణంగా గ్రామంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులు భావించారు. ఆ విషయం తెలుసుకున్న రవిప్రసాద్​.. భార్య గ్రామానికి వెళ్లేందుకు వాహనాల కోసం గంటలపాటు ఎదురుచూశాడు. లాక్​డౌన్​ కారణంగా .. వాహనాలు లేక సైకిల్​పైనే అగర్ మాల్వా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 13 గంటల్లో గమ్యాన్ని చేరుకున్నాడు.

ఇదీ చదవండి :ఒకే కారుతో మూడు రాష్ట్రాల్లో బీభత్సం- చివరకు...

ABOUT THE AUTHOR

...view details