మధ్యప్రదేశ్ ఇందోర్‌కు చెందిన ఓ వ్యక్తి మూగజీవిపై కర్కశంగా ప్రవర్తించాడు. తన ఇంటి నుంచి మాంసం పట్టికెళ్లిందన్న కారణంతో ఓ కుక్కను కర్రతో కొట్టి చంపాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ జరిగింది..
విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే జగదీశ్ చౌహాన్ అలియాస్ ఠాకుర్.. అదివారం మటన్ కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంతలో ఓ వీధి కుక్క ఠాకుర్ ఇంట్లోకి చొరబడి ఆ మాంసం ఉన్న సంచిని ఎత్తుకెళ్లింది. ఇది గమనించిన ఠాకుర్ ఆ కుక్కను వెంబడించాడు. మాంసం ఎత్తుకెళ్లినందుకు ఆ మూగజీవిని కర్రతో కొట్టి చంపేశాడు.
ఇదీ చూడండి :మద్యం తాగమని రాష్ట్ర ప్రజలు ప్రమాణం చేయాలి: సీఎం