తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శునకాన్ని చంపినందుకు యువకుడిపై దాడి.. ఆపై ఉరి వేసి...! - రేవాలో అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

MP man beaten: కుక్కపిల్లను చంపినందుకు గానూ ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఈ అవమాన భారంతో ఆ యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే, నిందితులే యువకుడికి ఉరి వేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

SUICIDE
యువకుడి ఆత్మహత్య

By

Published : Jan 31, 2022, 7:21 AM IST

MP man beaten: మధ్యప్రదేశ్​లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ కుక్క పిల్ల తన ట్రక్​ కింద పడడం కారణంగా అది చనిపోయింది. దీంతో ఇద్దరు యువకులు ఆ డ్రైవర్​ ఇంటికి వెళ్లి అతడ్ని కొట్టారు. అవమానంతో ఆ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది..

మధ్యప్రదేశ్​ రేవాలోని లంగర్ పుర్వా అనే గ్రామానికి చెందిన రాజ్​కరణ్​ విశ్వకర్మ అనే యువకుడి ట్రక్​ కింద ఓ కుక్క పిల్ల పడి చనిపోయింది. దీంతో సందీప్​ పటేల్​, చోటు అనే ఇద్దరు వ్యక్తులు ఆగ్రహం చెంది ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశారు. అవమాన భారంతో రాజ్​కరణ్​ తన గదిలో ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే మృతుని బంధువు వాదన మరోలా ఉంది. ఇద్దరు నిందితులే రాజ్​కరణ్​ను కొట్టి చంపి, అనంతరం ఉరివేసినట్లు ఆరోపిస్తున్నారు.

ప్రాథమికంగా దీనిని అత్మహత్యగా నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:17ఏళ్ల బాలికను బెదిరించి.. నెలలుగా 20 మంది అత్యాచారం!

ABOUT THE AUTHOR

...view details