పెట్రోల్ చౌకగా కావాలంటే అఫ్గానిస్థాన్ వెళ్లాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా నేత. ధరల పెరుగుదలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కటనీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్‌రతన్ పాయల్ ఈ మేరకు బదులిచ్చారు.
"ధరలు పెరుగుతున్నాయా? అయితే తాలిబన్ల చోటుకు వెళ్లండి. అక్కడ పెట్రోల్ రూ.50కే దొరుకుతుంది. కానీ దానిని కొనేవారున్నారా? కనీసం మన దగ్గర శాంతియుత పరిస్థితులున్నాయి. మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతోంది" అని రామ్‌రతన్ అన్నారు.