మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో దారుణం జరిగింది. అసహజ శృంగారం చేస్తూ తనను ఇబ్బంది పెట్టాడని భర్తపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. న్యూడ్ వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని లసుడియా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. రూ.కోటి రూపాయలు ఇవ్వకపోతే ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తకు అత్తమామలు కూడా సహకరిస్తున్నారని వారిపై కూడా కేసు పెట్టింది. బాధితురాలి భర్త.. స్వస్థలం కాన్పుర్ కావడం వల్ల ఈ కేసును అక్కడికి బదిలీ చేశారు లసుడియా పోలీసులు.
అసలేం జరిగిందంటే:
2018 జూలై 10న బాధితురాలికి కాన్పుర్‌కు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. కట్నంగా 40 తులాల బంగారం, కారు ఇచ్చారు. అనంతరం సరదాగా ఇరువురు హనీమూన్‌కు వెళ్లారు. అప్పుడు భర్త.. ఆమెను హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అసహజ శృంగారం చేయమని ప్రేరేపించాడు. అప్పుడే అతని అసలు బుద్ధి బాధితురాలికి అర్థమైంది. అయితే, అండగా ఉండాల్సిన అత్తామామలు కూడా ఆమెకు ప్రతికూలంగా మారారు. ఎవరికైనా ఈ విషయం చెబితే ఇబ్బందులు తప్పవంటూ మహిళను.. ఆమె మామ బెదిరించాడు. కోడలిని వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు ఇందోర్‌లోని తన పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పింది. అనంతరం లసుడియా పోలీసులను ఆశ్రయించింది.