తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరదల్లో చిక్కుకున్న హోంమంత్రి- రక్షించిన సిబ్బంది

వరదల్లో ముంపునకు గురైన గ్రామాలను పరిశీలించేందుకు వెళ్లిన హోంమంత్రి.. వరదల్లోనే చిక్కుకున్నారు. భారత వైమానిక దళం చాపర్​ సాయంతో హోమంత్రిని రక్షించారు సహాయ సిబ్బంది. మరో ఏడుగురు గ్రామస్థులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

madhya pradesh, floods
మధ్యప్రదేశ్, వరదలు

By

Published : Aug 5, 2021, 9:34 AM IST

Updated : Aug 5, 2021, 11:17 AM IST

వరదల్లో చిక్కుకున్న హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా

మధ్యప్రదేశ్​ దతియా జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా.. ఆ వరదల్లోనే చిక్కుకున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఐఏఎఫ్ చాపర్​ను సంఘటన స్థలానికి పంపించి.. మిశ్రాను రక్షించారు. హోంమంత్రితో పాటు మరో ఏడుగురు గ్రామస్థులను రక్షించారు భారత వైమానిక దళానికి చెందిన సహాయ సిబ్బంది.

తొలుత రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందంతో బోటుపై ముంపు ప్రాంతానికి వెళ్లారు మిశ్రా. అనంతరం బోటులో మోటార్ పాడైన తరుణంలో సహాయ సిబ్బందితో సహా వరదల్లో చిక్కుకుపోయారు.

ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డ అనంతరం మిశ్రా మీడియాతో మాట్లాడారు. సింధ్​ నది ప్రవాహం వల్ల సమీప కోత్రా గ్రామస్థులకు భారీగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

వరదల్లో చిక్కుకున్న గ్రామస్థులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు.

ఇదీ చదవండి:ఆ నది ఉగ్రరూపం- 50 ఏళ్లలో తొలిసారి ఇలా...

Last Updated : Aug 5, 2021, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details