'మా గ్రామం ఏ పరిధిలో ఉంది సారూ..' అంటూ మధ్యప్రదేశ్‌లోని ఉదయ్‌పురా ఊరి ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందడంలేదని వాపోతున్నారు. తమ పిల్లలు భవిష్యత్తు పట్ల భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?
'సారూ.. మా ఊరు ఎక్కడ ఉంది?'.. అధికారుల చుట్టూ తిరుగుతున్న గ్రామస్థులు! - ఏడాది కాలంగా ఇబ్బందులు పడుతున్నగ్రామస్తులు
మున్సిపల్ కౌన్సిల్ విభజన తర్వాత ఆ గ్రామ ప్రజలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. చదువు విషయంలో విద్యార్థులు కూడా నానాపాట్లు పడుతున్నారు. వీటిన్నంటికి ఒక్కటే కారణం. ఆ గ్రామాన్ని ఏ పరిధిలోనూ అధికారులు మ్యాపింగ్ చేయలేదు. అసలు ఆ గ్రామం కథేంటి?
ఉదయ్‌పురా గ్రామంలో గుణ జిల్లాలో ఉంది. సుమారు 300 మంది జనాభా ఉంటారు. ఒకప్పుడు ఆ ఊరు తోరై పంచాయతీలో ఉండేది. ఆ తర్వాత మధుసూదన్‌గఢ్ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడిన వెంటనే.. తోరై గ్రామ పంచాయతీని అందులో చేర్చారు. కానీ ఉదయపురా గ్రామాన్ని మాత్రం కౌన్సిల్‌తో చేర్చలేదు. దీంతో ఆ గ్రామస్థులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందడంలేదు. గ్రామంలోని పిల్లలను కూడా ఏ పాఠశాలలోనూ చేర్చుకోవడం లేదు. దీంతో వారంతా నానాపాట్లు పడుతున్నారు.
ఉదయ్‌పురా గ్రామ సమస్యపై జిల్లా కలెక్టర్ స్పందించారు. " ఆ గ్రామాన్ని మ్యాపింగ్ చేస్తున్న సమయంలో సాంకేతిక లోపం వల్ల ఈ సమస్య వచ్చింది. వీలైనంత త్వరగా గ్రామాన్ని ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేస్తాం. గ్రామ అభివృద్ధికి ఎలాంటి లోటు జరగకుండా చూస్తాం. విద్యార్ధుల చదువుకు ఆటంకం కలగకుండా వారికి ఐడీ కార్డులు మంజూరు చేస్తాం. సమస్యలన్నీ 20 నుంచి 25 రోజుల్లో తీరుస్తాం."