తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హై రిస్క్​ కోటాలో 'సెక్స్​ వర్కర్ల'కు టీకా!

కరోనా టీకా పంపిణీ హై రిస్క్​ జాబితాలో సెక్స్​ వర్కర్లను చేర్చింది మధ్యప్రదేశ్​ ప్రభుత్వం. అయితే.. ప్రజల నుంచి వ్యతిరేకత రావటం వల్ల ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. మరోవైపు.. హరియాణా గురుగ్రామ్​లో ట్రాన్స్​జెండర్లు, సెక్స్​ వర్కర్లకు వ్యాక్సినేషన్​ షురూ చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ ఇటావా జిల్లాలోని ఓ ప్రాంతంలో టీకా తీసుకున్న వారికే మద్యం విక్రయిస్తున్నారు.

'jabs for sex workers first
సెక్స్​ వర్కర్లకు టీకా

By

Published : May 31, 2021, 4:47 PM IST

కొవిడ్​-19 మహమ్మారిపై ముందుండి పోరాడే వారికి తొలుత వ్యాక్సిన్​ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అడుగు ముందుకేసి.. వ్యాక్సినేషన్​లో సెక్స్​ వర్కర్లకు తొలి ప్రాధాన్యంగా ఆదేశాలిచ్చి నాలుక కరుచుకుంది మధ్యప్రదేశ్​ ప్రభుత్వం. తీవ్రమైన వ్యతిరేకత రావటం వల్ల తమ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. కొత్త ఆదేశాల్లో సెక్స్​ వర్కర్ల స్థానంలో సెలూన్​ వర్కర్లుగా పేర్కొంది. తొలుత ఇచ్చిన ఆదేశాల్లో అచ్చు తప్పుగా పేర్కొంది.

ప్రాధాన్య క్రమంలో ఎవరికి వ్యాక్సిన్​ అందించాలనే అంశంపై రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్​ జారీ చేసింది. హై రిక్స్​ కేటగిరీలో పెట్రోల్​ పంప్​ కార్మికులు, నిత్యావసర దుకాణదారులు, ఇంట్లో పనిచేసేవారితో పాటు సెక్స్​ వర్కర్లను చేర్చింది. ఈ నోటిఫికేషన్​ను ట్విట్టర్​లో పోస్ట్​ చేస్తూ విమర్శలు చేసింది కాంగ్రెస్​. దీనిపై స్పందించిన నెటిజన్లు మధ్యప్రదేశ్​ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ట్రాన్స్​జెండర్లు, సెక్స్​ వర్కర్లకు టీకా షురూ

మరోవైపు... హరియాణాలోని గురుగ్రామ్​లో కొవిడ్​ వైరస్​ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాన్స్​జెండర్లు, సెక్స్​ వర్కర్లకు టీకా పంపిణీ కోసం దుందహేరా ప్రాంతంలో ప్రత్యేక క్యాంప్​ ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటి వరకు 200 మందికి వ్యాక్సిన్​ అందించారు. 'వారు హై రిస్క్​ జాబితాలో ఉన్నందున వారికి వ్యాక్సిన్​ అవసరం 'అని గురుగ్రామ్​ సివిల్​ సర్జన్​ డాక్టర్​ వీరేంద్ర యాదవ్​ తెలిపారు. ఈ క్రమంలో జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ట్రాన్స్​జెండర్లు. తొలి లాక్​డౌన్​లో తమకు ఎలాంటి సాయం చేయలేదని, ప్రస్తుతం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయటం వల్ల తాము కూడా సురక్షితమని భావిస్తున్నట్లు చెప్పారు.

సెక్స్​ వర్కర్లకు టీకా

టీకా తీసుకుంటేనే లిక్కర్​..

కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​ ఇటావా జిల్లా అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. సైఫఈ ప్రాంతంలోని మద్యం దుకాణాల్లో టీకా తీసుకుని, ధ్రువీకరణ పత్రం చూపిస్తేనే లిక్కరు విక్రయిస్తున్నారు. దుకాణాల ముందు కొవిడ్​-19 వ్యాక్సిన్​ తీసుకున్న వారికే మద్యం ఇస్తామనే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కానీ, ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదని జిల్లా అబ్కారీ శాఖ అధికారి కమల్​ కుమార్​ శుక్లా తెలిపారు. జిల్లా కలెక్టర్​ వ్యాక్సిన్​పై ప్రజలకు అవగాహన కల్పించాలని మాత్రమే సూచించారని చెప్పారు.

టీకా తీసుకుంటేనే మద్యం విక్రయాలు

ఇదీ చూడండి:ఇలా అయితే.. కొవిడ్‌-26, కొవిడ్‌-32 తప్పవు!

ABOUT THE AUTHOR

...view details