రెమ్‌డెసివిర్ ఔషధ నిల్వలను రవాణా చేస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఓ విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. గ్వాలియర్ వైమానిక దళ బేస్ క్యాంపులో గురువారం రాత్రి 8:30 గంటలకు ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు స్పల్ప గాయాలయ్యాయని గ్వాలియర్ ఎస్పీ అమిత్ సంఘి తెలిపారు. విమానంలోని రెమ్‌డెసివిర్ సరకు సురక్షితంగా ఉందని చెప్పారు. ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై విమానం స్వల్పంగా జారిందని పేర్కొన్నారు.