మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాకు చెందిన ఓ ఇంజినీర్ అద్భుత ప్రతిభను కనబర్చాడు. తన పాత మోటార్ బైక్ను శానిటైజింగ్ మెషీన్గా మార్చాడు. ఇళ్లు, వీధులు సహా.. అన్ని ప్రాంతాల్లోనూ వాడేందుకు వీలుగా దీన్ని రూపొందించాడు హుస్సాఫి ఖాన్.
ఎలా చేశాడంటే?

ఖాన్ వద్ద ఓ పురాతన 'రాజ్దుత్' మోటార్ బైక్ ఉంది. దాని వెనకభాగంలో ఇరువైపులా 60 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకర్లను, ఇంజిన్ సమీపంలో ఒక కంప్రెషర్ యంత్రాన్ని అమర్చాడు. బైక్ స్టార్ట్ అవ్వగానే.. ఆ మెషీన్ పనిచేసే విధంగా రూపొందించాడు. దానికి అమర్చిన పంపింగ్ పైప్ సాయంతో సులభంగా శానిటైజింగ్ చేసుకునేందుకు వీలుంటుంది. ఈ మెషీన్ను నియంత్రించేందుకు ఎక్సిలేటర్కు అనుసంధానించాడు ఖాన్.
తన పాత ద్విచక్రవాహనాన్ని... ఇలా శానిటైజింగ్ యంత్రంగా మార్చేందుకు రూ.12,000 ఖర్చయ్యాయి అంటున్నాడు ఖాన్. ఈ బైక్ సాయంతో ఇరుకైన వీధుల్లోకి కూడా సులభంగా వెళ్లి శానిటైజ్ చేయవచ్చన్నాడు. ఈ ద్విచక్రవాహనాన్ని ప్రస్తుతం.. 'న్యూ యూత్ ట్రాన్స్ఫర్మేషన్ సోషల్ ఆర్గనైజేషన్(ఎన్యూటీఎస్ఓ)' నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి:కరోనా రోగులకు ఆటో సేవలు- ఉపాధ్యాయుడి ఉదారత