తెలంగాణ

telangana

By

Published : Apr 24, 2021, 12:05 PM IST

ETV Bharat / bharat

కరోనా రోగుల కోసం 180 కి.మీ. ప్రయాణించి సేవలు

కరోనా కేసుల పెరుగుదలతో చలించిపోయిన ఓ వైద్యురాలు.. మండుటెండలో స్కూటీపై 180 కిలోమీటర్లు ప్రయాణించి రోగులకు సేవలందిస్తున్నారు. మధ్యప్రదేశ్​ నుంచి మహారాష్ట్రలోని నాగ్​పుర్​ చేరుకుని కొవిడ్​ కేర్​ సెంటర్​లో విధులు నిర్వర్తిస్తున్నారు.

Doctor praghya
ప్రగ్యా ఘడే, వైద్యురాలు.

స్కూటీపై 180 కిమీ ప్రయాణించి కరోనా రోగులకు సేవలు

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతితో లక్షల మంది వైరస్​ బారిన పడుతున్నారు. వైద్య సిబ్బంది, పోలీసులు, ఫ్రంట్​లైన్​ వర్కర్లు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవలందిస్తున్నారు. ఆ కోవకే చెందుతారు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ వైద్యురాలు. మండుటెండలో 180 కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై ప్రయాణించి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు.

స్కూటీపైనే..

మధ్యప్రదేశ్​కు చెందిన వైద్యురాలు ప్రగ్యా ఘడే.. మహారాష్ట్ర నాగ్​పుర్​లోని కొవిడ్​ కేర్​ సెంటర్​లో విధులు నిర్వర్తిస్తున్నారు. లాక్​డౌన్​ విధించిన క్రమంలో ఇటీవలే తమ స్వగ్రామం ఎంపీలోని బాలాఘట్​కు వెళ్లారు. అయితే.. కేసులు భారీగా పెరగడం వల్ల ఆసుపత్రిలో పరిస్థితి తెలుసుకున్న వైద్యురాలు చలించిపోయారు. వెంటనే విధుల్లో చేరాలని నిశ్చయించుకున్నారు. లాక్​డౌన్​లో ఎలా వెళ్లగలనని ఒక్క క్షణం కూడా ఆలోచన చేయలేదు. వెంటనే తన స్కూటీ తీసుకుని ప్రయాణం మొదలు పెట్టారు. మండుటెండలో 7 గంటల పాటు ఎలాంటి ఆహారం లేకుండా 180 కిలోమీటర్లు ప్రయాణించారు. నాగ్​పుర్​లోని ఆసుపత్రికి చేరుకుని సేవలందిస్తున్నారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో తన గురించి ఆలోచన చేయకుండా విధుల్లో చేరిన వైద్యురాలిని తోటి సిబ్బంది, ఉన్నతాధికారులు ప్రశంసించారు.

"లాక్​డౌన్​ సమయంలో బాలాఘట్​కు వచ్చాను. కానీ కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని సమాచారం అందింది. నాగ్​పుర్​ తిరిగి వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. దాంతో నా ద్విచక్రవాహనంపైనే ఆసుపత్రికి చేరుకోవాలని నిర్ణయించుకున్నాను. తొలుత మా తల్లిదండ్రులు నిరాకరించినా.. తర్వాత అనుమతించారు."

- ప్రగ్యా ఘడే, వైద్యురాలు.

నాగ్​పుర్​లోని కొవిడ్​ కేర్​ సెంటర్​లో ఆరు గంటల పాటు రోగులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు ప్రగ్యా. ఆ తర్వాత మరో ఆసుపత్రికి వెళ్లి కరోనా బాధితులకు సాయం చేస్తున్నట్లు తెలిపారు. రోజులో 12 గంటల పాటు పీపీఈ కిట్టు ధరించి విధులు నిర్వర్తిస్తున్నానని, ఈ క్లిష్ట సమయంలో రోగులకు సాయం చేయటం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.

ఇదీ చూడండి:ఆక్సిజన్ కొరతతో ఐదుగురు కరోనా రోగులు మృతి

ABOUT THE AUTHOR

...view details