తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తిరిగి విధుల్లోకి 'సింహా' మీసాల పోలీసు- సస్పెన్షన్​ ఎత్తివేత

Moustache Police Suspension: మధ్యప్రదేశ్​ భోపాల్​లో జుట్టు, మీసాలు ఎక్కువగా పెంచిన కారణంగా సస్పెండ్​ అయిన కానిస్టేబుల్​ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు అధికారులు. అతనిపై విధించిన సస్పెన్షన్​ను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

MP cop suspension reinstated
మీసాల పోలీసుపై సస్పెన్షన్​ ఎత్తివేత

By

Published : Jan 10, 2022, 5:44 PM IST

Moustache Police Suspension: 'సింహా' మీసాలతో విధులకు హాజరైనందుకు సస్పెన్షన్​ను ఎదుర్కొన్న మధ్యప్రదేశ్​ పోలీస్​ కానిస్టేబుల్​ రాకేశ్​ రాణాను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాణాపై సస్పెన్షన్​ వేటు వేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ఏఐజీ ప్రశాంత్​ శర్మకు అతన్ని తప్పించే అధికారం లేదని పేర్కొన్నారు. అందుకే ఆ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకున్నట్లు వివరించారు.

సస్పెన్షన్​ ఎత్తివేతతో.. రాకేశ్​ రాణా తిరిగి పోలీస్​ డిపార్ట్​మెంట్​లో మోటార్​ వెహికల్​ విభాగంలో డ్రైవర్‌గా చేరనున్నారు.

మీసాల కోసం..

రాణా మెడ వరకు మీసాలు, జుత్తుతో విధులు హాజరయ్యారని, వాటిని కత్తిరించమని చెప్పినప్పటికీ వినకపోవడం వల్ల సస్పెన్షన్ వేటు పడిందని ఏఐజీ ప్రశాంత్​ శర్మ ఇటీవల స్పష్టం చేశారు. యూనిఫాం వేసుకున్న ఏ వ్యక్తి కూడా అటువంటి వేషధారణతో విధులకు హాజరుకారని పేర్కొన్నారు. ఈ కారణంగానే రాణాను విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'సింహా' స్టైల్ మీసంపై మోజు.. పోలీస్ కానిస్టేబుల్ సస్పెన్షన్

ABOUT THE AUTHOR

...view details