తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎమ్మెల్యే కుమారుడిపై రేప్​ కేసు- పట్టిస్తే రూ.25వేల రివార్డు! - రేప్ వార్తలు

రేప్​ కేసులో పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు. అతడిపై ఉన్న రివార్డును కూడా రూ.10వేల నుంచి రూ.25వేలకు పెంచారు.

mp-cong-mlas-son-booked-for-rape-continues-to-evade-arrest
ఎమ్మెల్యే కుమారుడిపై రేప్​ కేసు- పట్టిస్తే రూ.25వేల రివార్డు

By

Published : Oct 22, 2021, 9:59 PM IST

మధ్యప్రదేశ్​కు చెందిన కాంగ్రెస్​ ఎమెల్యే మురళీ మోర్వాల్​ కుమారుడు కరణ్​ మోర్వాల్.. ఓ​ రేప్​ కేసులో పోలీసులకు దొరకడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్​ 2న అతడిపై కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి కిరణ్​ అండర్​గ్రౌండ్​లోకి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10వేలు బహుమానం ప్రకటించారు పోలీసులు.

నెలలు గడుస్తున్నా కిరణ్​ మోర్వా ఆచూకీ తెలియడం లేదు. దీంతో అతడిపై ఉన్న రివార్డును రూ.10వేల నుంచి రూ.25వేలకు పెంచుతున్నట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్​ బుధవారం ప్రకటించారు. అయినా అతని గురించి ఎలాంటి సమాచారం అందడం లేదు. కరణ్​ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

అయితే కరణ్ సోదరుడు శివంను పోలీసులు ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. రేప్​ కేసు నమోదైన పలాసియా పోలీస్ స్టేషన్​కు ఎమ్మెల్యే మురళీ మోర్వాల్ వెళ్లారని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. స్టేషన్​కు ఎందుకు వెళ్లారని మీడియా అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే సమాధానం ఇవ్వలేదు.

60ఏళ్ల మహిళపై 20ఏళ్ల యువకుడు అత్యాచారం

ఝార్ఖండ్ సిమ్​డెగా జిల్లాలో 60ఏళ్ల మహిళపై 20ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. హొటల్​లో పనిచేస్తున్న ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఒడిశా మీదుగా దిల్లీ పారిపోయేందుకు అతడు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

ఇదీ చదవండి:ఫుడ్ డెలివరీ బాయ్స్​ ముసుగులో డ్రగ్స్ దందా

ABOUT THE AUTHOR

...view details