తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'స్టార్​ క్యాంపెయినర్​ ఎవరో ఈసీ ఎలా నిర్ణయిస్తుంది?'

స్టార్ క్యాంపెయినర్​గా కాంగ్రెస్ నేత కమల్​నాథ్​ను తొలగిస్తూ ఎన్నికల సంఘం(ఈసీ) ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రముఖ ప్రచార నాయకుడు ఎవరో నిర్ణయించే అధికారం ఈసీకి ఎవరిచ్చారని ప్రశ్నించింది ధర్మాసనం.

By

Published : Nov 2, 2020, 2:34 PM IST

Updated : Nov 2, 2020, 3:24 PM IST

MP bypolls: SC stays EC order revoking star campaigner status of ex-CM Kamal Nath
ఎన్నికల సంఘం ఆదేశాలపై సుప్రీం స్టే

కాంగ్రెస్ నేత కమల్​నాథ్​కు ప్రముఖ ప్రచారకర్త హోదాను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం(ఈసీ) ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రాథమికంగా పార్టీ నాయకుడెవరో నిర్ణయించే అధికారం ఈసీకి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రముఖ ప్రచార నాయకుడు ఎవరో నిర్ణయించే అధికారం ఎవరిచ్చారని ఈసీని ప్రశ్నించింది ధర్మాసనం. పిటిషన్​పై సమాధానం ఇవ్వాలని ఈసీకి నోటీసులు జారీ చేసింది సుప్రీం.

మధ్యప్రదేశ్​లో 28 అసెంబ్లీ స్థానాలకు ప్రచారం ముగిసిందని, మంగళవారం ఎన్నికలు జరగనున్నాయని కోర్టుకు తెలిపింది ఈసీ. ఇప్పటికే ప్రచారం ముగిసినందున కమల్​నాథ్ పిటిషన్ చెల్లుబాటు కాదని వాదన వినిపించింది ఎన్నికల సంఘం.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణతో కమల్​నాథ్ ప్రచార కర్త హోదాను ఈసీ తొలగించింది. దీని సవాలు చేస్తూ అక్టోబరు 30న ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు​.

తీర్పుపై ఈసీ స్పందన

సుప్రీంకోర్టే సర్వోన్నతమైనదని వ్యాఖ్యానించింది ఎన్నికల సంఘం. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే పిటిషన్​పై తమ అభిప్రాయం చెబుతామని తెలిపింది.

ఇదీ చూడండి:ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు కమల్​నాథ్​

Last Updated : Nov 2, 2020, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details