వివాహానికి పిలవలేదని వరుడిని తీవ్రంగా కొట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలోని చందుపురలో జరిగింది. దీనిపై పెళ్లి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు నరేంద్ర కుష్వాహపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కరోనా ఆంక్షల కారణంగా తాను తెలిసిన వారందరినీ పెళ్లికి పిలవలేకపోయినట్లు బాధితుడు చెప్పాడు. కేవలం తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే వివాహం చేసుకున్నట్లు పోలీసులకు వివరించాడు. దీనిపై కోపం తెచ్చుకున్న కుష్వాహ పరుష పదజాలంతో దూషిస్తూ, తనపై దాడి చేసినట్లు పేర్కొన్నాడు.