Hamidia hospital: మధప్రదేశ్ భోపాల్‌లోని హమీదియా ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న 50 మంది నర్సులు తమపై సూపరింటెండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మధ్యప్రదేశ్‌లోనే అతిపెద్ద వైద్య కేంద్రంలో ఇలా జరగడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్ మానవహక్కుల కమిషన్ కూడా ఆరోగ్య శాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై 10 రోజుల్లోగా స్పందన తెలపాలని కోరింది.
ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఫిర్యాదు వచ్చినమాట వాస్తవమేనని మధ్యప్రదేశ్ ఆరోగ్యమంత్రి విశ్వాస్ సారంగ్ వెల్లడించారు. ఈ విషయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. డివిజనల్ కమిషనర్ గుల్షాన్ బమ్రా దీనిపై దార్యాప్తు చేస్తారని వివరించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో 50 మంది నర్సులపై లైంగిక వేధింపులు! - Sexual harassment news latest
Sexual harassment: ప్రభుత్వ ఆస్పత్రిలో 50 మంది నర్సులపై సూపరింటెండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం దుమారం రేపింది. ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని సర్కారు ఆదేశించింది.
ఆస్పత్రిలో, ప్రత్యేకించి రాత్రి వేళ విధులు నిర్వహించే సమయంలో నర్సులపై సూపరింటెండెంట్ డా.దీపక్ మరావీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని సిబ్బంది వర్గాలు తెలిపాయి. వికృత చేష్టలతో ఇబ్బంది పెడుతున్నాడని పేర్కొన్నాయి. ఈ ఘటనపై మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ స్పందించారు. ప్రఖ్యాతిగాంచిన ఆస్పత్రిలో ఇలా జరగడం దారుణమన్నారు. నిందితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, మైనర్లపై నేరాల్లో మధ్యప్రదేశ్ దేశంలోనే టాప్‌లో ఉందన్నారు. చిన్నారులకు కూడా భద్రత లేదన్నారు. ఇది సుపరిపాలనా? అని భాజపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:రాష్ట్రపతి ఎన్నికపై విపక్ష నేతలతో రాజ్‌నాథ్ చర్చ.. ఏకగ్రీవానికి పావులు?