Man Marries Three Partners: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురితో సహజీవనం చేశారో వ్యక్తి. ఇప్పుడు ఆ ముగ్గురినీ వివాహం చేసుకున్నారు. అదీ ఒకే వేదికపై. మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పుర్ జిల్లాకు చెందిన 42 ఏళ్ల సమర్థ్ మౌర్య గతంలో సర్పంచిగా పనిచేశారు. 15 సంవత్సరాలుగా ఆయన ముగ్గురితో సహజీవనం చేస్తున్నారు. ఇప్పటికే వారికి ఆరుగురు పిల్లలు. ఈ నేపథ్యంలో తాజాగా గిరిజన సంప్రదాయం ప్రకారం ఒకే వేదికపై ముగ్గురినీ పెళ్లి చేసుకున్నారు. వారి ఆరుగురు పిల్లలూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.
"2003లో నా మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడింది. 15 ఏళ్లుగా మరో ఇద్దరితో కలిసి ఉంటున్నాను. ఏప్రిల్ 30న నాకు వివాహం జరిగింది. మా సంప్రదాయం ప్రకారం వివాహం జరిగే వరకు ఏ కార్యక్రమానికి అనుమతించరు. గతంలో నన్ను ఏ శుభకార్యానికి అనుమతించలేదు."