తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సిగరెట్టుకు డబ్బులు అడిగారని కొట్టి చంపేశారు! - సెహదోల్​ వార్తలు

సిగరెట్టుకు డబ్బులు అడిగినందుకు దుకాణాదారుడ్ని కొట్టి చంపారు నలుగురు యువకులు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్​లోని సెహదోల్​ జిల్లాలో జరిగింది.

shopkeeper to death after being told to pay for cigarettes
సిగరెట్టుకు డబ్బులు అడిగారని

By

Published : Oct 16, 2021, 8:46 PM IST

తాగిన సిగరెట్టుకు డబ్బులు అడిగినందుకు.. నలుగురు యువకులు దుకాణాదారుడ్ని తీవ్రంగా కొట్టారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని సెహదోల్​లో జరిగింది. మృతుడ్ని అరుణ్​ సోనిగా గుర్తించిన అధికారులు.. ఈ దారుణానికి పాల్పడిన వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

జిల్లా కేంద్రానికి 90 కిమీల దూరంలో ఉన్న డియోలాండ్​లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ దాడికి పాల్పడిన వారిని మను ఖాన్​, పంకజ్​ సింగ్​, విరాట్​ సింగ్​, సందీప్​ సింగ్​లుగా గుర్తించారు.

ఇదీ జరిగింది...

శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు సిగరెట్టు కోసమని అరుణ్​ సోనీ అనే వ్యక్తి దుకాణానికి వెళ్లారు. నలుగురు సిగరెట్లు తీసుకున్న తరువాత వాటికి డబ్బులు కట్టమని సోని అడిగాడు. దీంతో కోపం తెచ్చుకున్న వారు దుకాణాదారుడిని తీవ్రంగా గాయపరిచారు. పక్కన ఉన్న సోనీ కుమారులు అతడ్ని కాపాడేందుకు ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న కొద్దిసేపటికే సోని మరణించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరోకరి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం- పాక్​ నుంచే!

ABOUT THE AUTHOR

...view details