ప్రపంచమంతా కరోనా ధాటికి వణికిపోతున్న వేళ.. మధ్యప్రదేశ్‌లో 104ఏళ్ల వృద్ధుడు ఆ మహమ్మారిని జయించాడు. దీనిపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆనందం వ్యక్తం చేశారు.
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ "కరోనా నుంచి కోలుకున్న మీ నుంచి ప్రేరణ పొందడం ద్వారా.. కొవిడ్ రోగులు సరైన చికిత్స పొంది, ఆరోగ్యంగా ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. బిర్దీ చంద్జీ.. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి."
- సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
బెతుల్ జిల్లాకు చెందిన బిర్దీ చంద్‌కు ఈ నెల 5న కరోనా పాజిటివ్ వచ్చింది. తాను ఏ మాత్రం భయపడలేదని.. ఆస్పత్రికీ వెళ్లలేదని బిర్దీ చంద్ తెలిపారు. శాకాహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ సానుకూల దృక్పథంతో ఉన్నట్లు వెల్లడించారు. ఓ వైద్యుడు సూచించిన మందులను మాత్రం వాడినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:కొవాగ్జిన్ ధర ప్రకటించిన భారత్ బయోటెక్