తమిళనాడులో 234 స్థానాలకు ఓటింగ్ జరుగుతున్న వేళ సినీ తారల సందడి నెలకొంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రముఖ నటులు పోలింగ్ కేంద్రాలకు తరలివెళుతున్నారు.
కమల్-రజనీ..
దిగ్గజ నటుడు, మక్కం నీది మయ్యం అధినేత కమల్ హాసన్.. చెన్నై తేన్యంపేట్లోని ఓ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమల్ కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్‌లు కూడా తండ్రితో కలిసి ఓటేశారు.
ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ థౌజెండ్ లైట్స్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటేశారు.