తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిల్లలను చెరువులో పడేసిన తల్లి- ముగ్గురు మృతి - బిహార్ తాజా వార్తలు

ఓ మహిళ.. అభంశుభం తెలియని తన నలుగురు కుమార్తెలను చెరువులో పడేసింది. అందులో ముగ్గురు మృతిచెందగా.. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

mother threw her four daughters
పిల్లలను చెరువులో పడేసిన తల్లి

By

Published : Jul 24, 2021, 1:21 PM IST

బిహార్​ గోపాల్​గంజ్​లో హృదయవిదారక ఘటన జరిగింది. ఓ మహిళ తన నలుగురు కుమార్తెలను చెరువులో పడేసింది. దీంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతోంది. అయితే.. పిల్లలను చెరువులో పడేయాటానికి గల కారణాలు తెలియలేదు.

ఏం జరిగిందంటే?

గోపాల్​గంజ్​ జిల్లా కటియాకు చెందిన అస్లాం మియామ్​ భార్య.. గౌరా గ్రామంలోని చెరువు దగ్గరకు తన నలుగురు కుమార్తెలను తీసుకెళ్లి.. ఒకరివెంట ఒకరిని నీళ్లలో తోసేసి అక్కడినుంచి పారిపోయింది. ఈ క్రమంలో ముగ్గురు చిన్నారులు మృతిచెందగా.. మరో చిన్నారి అఫ్రిన్(4) గడ్డిని పట్టుకుని అరవటం ప్రారంభించింది. అటుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనదారుడు.. అరుపులను విని చిన్నారిని రక్షించాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:'లవర్స్​తో కలిసి భర్తను మేడపై నుంచి తోసిన భార్య!'

ABOUT THE AUTHOR

...view details