Mother risks son for sari: హరియాణా ఫరీదాబాద్‌కు చెందిన ఓ మహిళ.. తన చీర కోసం కొడుకుతో సాహసం చేయించింది. తొమ్మిదో అంతస్తులో నివాసం ఉంటున్న ఆ మహిళ.. తన దుస్తులను బాల్కనీలో ఆరేసింది. అయితే గాలి బలంగా వీడయం వల్ల ఓ చీర.. ఎనిమిదో అంతస్తు బాల్కనీలో పడిపోయింది. దీంతో తన కొడుకును రంగంలోకి దింపింది ఆ తల్లి.
ఓ బెడ్‌షీట్ సాయంతో తొమ్మిదో అంతస్తు నుంచి తన కొడుకును ఎనిమిదో అంతస్తుపైకి వెళ్లేలా చేసింది ఆ మహిళ. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు.